కార్యాలయానికి సైకిల్‌పై వచ్చిన కేంద్ర మంత్రి

బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్షవర్థన్ తన ప్రత్యేకతను చాటారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన...
బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్షవర్థన్ తన ప్రత్యేకతను చాటారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయనకు ప్రధాని మోడీ తన రెండో మంత్రివర్గంలో ఆరోగ్య శాఖను కేటాయించారు. దేశ ప్రజలను ఆరోగ్య కరంగా ఉంచడమే ఆయన కర్తవ్యం. అందుకే బాధ్యతలను చేపట్టే రోజు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రచారం చేయాలని భావించిన ఆయన.. ఇంటి దగ్గరి నుంచి సచివాలయానికి సైకిల్‌పై వెళ్లి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అందువల్ల దీనిని తెలియజేసేందుకే హర్షవర్థన్ సైకిల్‌పై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. సైకిల్ అందుబాటు ధరలో ఉండే రవాణా సాధనమే గాక... ఆరోగ్యకరమైనది కూడా అని మంత్రి తెలిపారు.
ఆరోగ్య రంగంలో ప్రధాని మోడీ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లామని.. ఆరోగ్యకర భారతవని కోసం అన్ని చర్యలు తీసుకుంటామని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకునేలా అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజలందరికీ చేరేలా చూస్తామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT