సుష్మా మృతిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సంతాపం

సుష్మా మృతిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సంతాపం
x
Highlights

మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మరణించారు. నిన్నరాత్రి గుండెపోటు రావడంతో ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే మూడుగంటలపాటు...

మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మరణించారు. నిన్నరాత్రి గుండెపోటు రావడంతో ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే మూడుగంటలపాటు చికిత్స అనంతరం ఆమె మరణించారు. దీంతో సుష్మా భౌతిక కాయానికి ప్రముఖ నేతలంతా నివాళులర్పిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతికి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్ మంచి వక్త, సమర్థవంతురాలైన రాజకీయ నాయకురాలని మాయావతి ప్రశంసించారు. సుష్మాకు పరిపాలనా దక్షిత ఉందని, ఆమె వ్యక్తిగతంగా అందరితో స్నేహభావంతో కలిసి మెలసి ఉంటారని మాయావతి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా సుష్మా అందరితో బాగుండేవారని మాయావతి చెప్పారు. సుష్మా లేని లోటు తీరనిదని అంటూ కుటుంబ సభ్యులకు మాయావతి తీవ్ర సంతాపం తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories