కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కిట్లు.. ఇక ఇంట్లోనే తెలుసుకోవచ్చు!

కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కిట్లు.. ఇక ఇంట్లోనే తెలుసుకోవచ్చు!
x
testing kits for corona (representational image)
Highlights

కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకారో ఇప్పటికే అందరికీ తెలిసింది. కరోనా వ్యాధి సోకిందో లేదో తెలుసుకోవాలన్నా ప్రస్తుతం ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వమే కరోనా...

కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకారో ఇప్పటికే అందరికీ తెలిసింది. కరోనా వ్యాధి సోకిందో లేదో తెలుసుకోవాలన్నా ప్రస్తుతం ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వమే కరోనా సోకిందో లేదో తెలియడం కోసం పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే, ఈ పరీక్షల కోసం ముందుకు రావడానికీ ప్రజలు జంకుతున్నారు. ఒక్కసారి ఆసుపత్రికి కరోనా లక్షణాలతో పరీక్షల కోసం వెళితే, చుట్టుపక్కల వారు తమకు కరోనా ఉన్నా లేకపోయినా అనుమానపు చూపులు చూస్తారనేది ప్రధాన భయంగా మారింది. ఇప్పడు ఈ పరిస్త్తితులకు చెక్ పెట్టె అవకాశం వచ్చిందని చెబుతున్నారు.

బెంగళూరు కేంద్రంగా పనిచేసే బయోనె అనే సంస్థ తాము ఇంట్లోనే సులువుగా కరోనా వ్యాది సోకిందో లేదో నిర్ధారించే పరికరాన్ని రూపొందించినట్టు చెబుతోంది. ఈ కిట్లతో పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని అంటోంది. ఇప్పటికే ఈ కితల విషయంలో భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అనుమతి కూడా లభించిందని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ భాగస్వామ్య సంస్థలతో కల్సి ఈ కిట్లను రూపొందించినట్టు సంస్థ తెలిపింది. త్వరలోనే మరిన్ని నాణ్యత పరమైన కఠిన పరిశీలనలను జరిపిన్ తరువాత మార్కెట్లోకి తీసుకువస్తామని ఆ ప్రతినిధులు చెప్పారు. బయోనె సంస్థ జన్యు, సూక్ష్మజీవుల పరిణామాలకు సంబంధించి పలు పరీక్షలను, పరిశోధనలను సాగిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories