గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పై దాడి

*రెండ్రోజులుగా ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న కేజ్రీవాల్

Rama Rao
Published on: 2 Oct 2022 7:05 PM IST
Attack on Delhi CM Arvind Kejriwal in Gujarat election campaign
X

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పై దాడి

Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‎పై దాడి జరిగింది. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని వెనక నుంచి ఆయనపైకి బాటిల్‌ విసిరాడో వ్యక్తి. అయితే ఆ వాటర్ బాటిల్ కేజ్రీవాల్ దాటుకుని ముందుకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ పట్టించుకోలేదు. గుజరాత్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ప్రచారంలో స్పీడు పెంచిన కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

అలా గుజరాత్ లోని రాజ్‌కోట్‌లోని ఖోదల్‌ధామ్ ఆలయంలో నిర్వహించిన గర్భా వేడుకలకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఓ వేధికపై నుంచి కేజ్రీవాల్‌ ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్ బాటిల్ దూసుకొచ్చింది. ఈ వాటర్ బాటిల్ ఎటాక్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rama Rao

Rama Rao

Next Story