దేశంలో ఎక్కడున్నా రేషన్..స్వల్ప అద్దెకే నివాసం!!

దేశంలో ఎక్కడున్నా రేషన్..స్వల్ప అద్దెకే నివాసం!!
x
Highlights

ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్ధిక ప్యాకేజీ ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఈరోజు మరిన్ని రంగాలకు ఇచ్చే వేసులుబాట్లను ఆర్ధిక...

ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్ధిక ప్యాకేజీ ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఈరోజు మరిన్ని రంగాలకు ఇచ్చే వేసులుబాట్లను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రకటించారు.

రేషన్ పోర్టబిలిటీ..

రేషన్‌ కార్డులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం/ గోధుమలు పంపిణీ చేస్తాం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రేషన్ కోసం ఆర్ధిక మంత్రి చెప్పిన మరిన్ని వివరాలు..

- ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు పంపిణీ చేస్తారు.

- రేషన్‌ కార్డు లేనివారు కూడా బియ్యం/గోధుమలు, పప్పు పొందొచ్చు.

- వలస కార్మికులు ఎక్కడున్నా, కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందొచ్చు.

- ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాయి.

- రేషన్‌ కార్డు పోర్టబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రేషన్‌ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు.

- ఆగస్టు నాటికి ఒకే దేశం - ఒకే కార్డు అమలులోకి తీసుకొస్తారు. దీనితో 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది

స్వల్ప అద్దేకే నివాస గృహాలు..

అద్దె ఇళ్ళలో ఉండే వారికోసం ప్రత్యేక ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాని ప్రకారం..

-వలస కార్మికులు, పట్టణ పేదలు కోసం స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం తీసుకొస్తారు.

- పట్టణ పేదలు, వలస కూలీలకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతితో ఈ గృహాల నిర్మాణం ఉంటుంది.

- రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడితే కేంద్రం తగిన సాయం అందిస్తుంది.

- వలస కార్మికులకు నివాసానికి ఇబ్బంది లేకుండా నూతన పథకం ఉంటుంది.

- ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఈ పథకాన్ని తీసుకొస్తారు.

- భూమి ఉన్నవాళ్లు ముందుకొస్తే తగిన సాయం కోసం కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories