ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం : వ్యవ'సాయమే' ప్రధానం!

ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం : వ్యవసాయమే ప్రధానం!
x
Highlights

కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్ భారత్ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు.

కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్ భారత్ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు. వాటి వివరాలివే..

పాడి పరిశ్రమకు పాలు పోశారు..

దేశంలో సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పాడి పరిశ్రమకు ఇప్పటికే 'ఫసల్‌ బీమా యోజన' కింద ₹6,400 కోట్లు పరిహారం ఇచ్చామనీ, ₹74,300 కోట్లు మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు చేశామనీ నిర్మలా సీతరామన్ వెల్లడించారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించి తద్వారా ₹4,100 కోట్ల రూపాయలను రైతులకు ప్రయోజనం చేకూర్చమని వివరించారు. ఇక భవిష్యత్తులో పాడి పరిశ్రమకు ఇవ్వబోయే చేయూత ఇదే..

- పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. - దీని కోసం ₹13,343 కోట్లు కేటాయించారు.

- పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు ₹15 వేల కోట్లు కేటాయించారు. - పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు.

మత్స్యరంగానికి చేదోడుగా..

మత్స్య సంపద యోజనకు ₹20 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇంకా ఆర్ధిక మంత్రి మత్స్యరంగానికి ప్రకటించిన ప్రత్యేక వెసులుబాట్లు..

- దేశంలో మత్స్యకార రంగంలో ఉపాధి పొందుతున్న55 లక్షల మంది.

- వీరందరికీ వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం.

- రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా.

- మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబన సాధించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.

- ఫిషింగ్‌ హార్బర్‌, శీతల గోదాములు, మార్కెట్ల కోసం ₹9 వేల కోట్లు కేటాయింపు.

- గడువు తీరిన ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్‌ గడువు మూడు నెలలు పొడిగింపు.

రైతుల కోసం మరిన్ని..

నిన్న (మే 14) రైతులకు ఇస్తున్నాట్టు చెప్పిన ఆర్ధిక సహకారంతో పాటు ఈరోజు మరిన్ని రైతు సంక్షేమ విధానాలను ఆర్ధిక మంత్రి ప్రకటించారు.

- వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు.

-దేశవ్యాప్తంగా ఎక్కడ ఉత్పత్తి అయిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులైనా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతులకు కల్పిస్తారు. ఇంతకు ముందు ఈ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే ఏర్పాట్లు చేస్తారు.

-- అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగిస్తారు.

- దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తారు.

- వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్ విధానం బలోపేతం చేస్తారు.

- లైసెన్స్ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చు.

- ప్రతి సీజన్‌కు ముందే ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టపరమైన ఏర్పాటు చేస్తారు.

మొత్తమ్మీద ప్రధాని ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories