పోలీసింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ.. దేశంలోనే తొలిసారిగా యాంటీ డ్రోన్‌ వెహికిల్ ఏర్పాటు

Anti Drone Vehicle is Set Up For the First Time in the Country
x

పోలీసింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ.. దేశంలోనే తొలిసారిగా యాంటీ డ్రోన్‌ వెహికిల్ ఏర్పాటు

Highlights

Anti Drone: యాంటీ డ్రోన్‌ వాహనాన్ని తయారు చేసిన కేరళ ఫోరెన్సిక్‌ శాఖ.. యాంటీ డ్రోన్‌ వెహికిల్‌ ఖర్చు రూ.80 లక్షలు

Anti Drone: పోలీసింగ్‌లో దూసుకెళుతున్న కేరళ కాప్స్‌ మరో సరికొత్త రికార్డ్‌ సొంతం చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా యాంటీ డ్రోన్‌ వాహనాన్ని సొంతం చేసుకున్నారు. ఈగల్‌ ఐ గా పిలుస్తున్న ఈ వాహనాన్ని కేరళ డ్రోన్‌ ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ అభివృద్ధి చేసింది. ఈ యాంటీ డ్రోన్‌ వెహికిల్‌ ఖర్చు 80లక్షల పైమాటే.. అనుమతి లేకుండా ఎగిరే.. దాడులకు పాల్పడే డ్రోన్లను కూల్చివేసే సామర్ధ్యం ఈ వాహనం సొంతం. విమానాశ్రయాలు, ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో యాంటీ డ్రోన్‌ వెహికిల్‌ను అందుబాటులో ఉంచుతారు. ఈ వాహనంలోని సాంకేతిక వ్యవస్థ అయిదు కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడమే కాకుండా కూల్చివేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories