డ్రగ్స్‌ కేసులో మరో నిందితుడు అరెస్ట్‌.. ఎడ్విన్‌తో కలిసి డ్రగ్స్‌ సరఫరా చేసిన బాల మురుగన్‌ అరెస్ట్‌

another accused was arrested in the drug case
x

డ్రగ్స్‌ కేసులో మరో నిందితుడు అరెస్ట్‌

Highlights

* పీటీ వారెంట్‌పై గోవా నుంచి తీసుకొచ్చిన పోలీసులు.. పలువురు ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు అనుమానాలు

Drugs Peddlers: డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు బాలమురుగన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవా నుంచి అంతర్జాతీయ స్థాయిలో మత్తుపదార్థాల వ్యాపారం చేస్తున్న ఎడ్విన్‌తో కలిసి బాలమురుగన్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికి చిక్కకుండా వ్యాపారం సాగిస్తున్న బాలమురుగన్‌ను ఎడ్విన్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవాలో డ్రగ్స్ దందా చేసినట్లు వెల్లడించారు. బాలమురుగన్‌ జాబితాలో రెండువేల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నట్లు తెలిపారు. బాలమురుగన్‌ను ఇప్పటికే గోవా నుంచి పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కాగా మురుగన్ 15 ఏళ్లుగా ఎడ్విన్‌తో కలిసి వేల మందికి డ్రగ్స్ చేరవేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories