సర్పంచ్ పదవిలో బామ్మ.. ఆమె వయసు ఎంతో తెలుసా?

సర్పంచ్ పదవిలో బామ్మ.. ఆమె వయసు ఎంతో తెలుసా?
x
Highlights

సాధారణంగా 90 ఏళ్లు దాటాయంటే వృద్ధులు మనవళ్లతో, మనవరాళ్లతో, మునిమనవళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తా్రు.

సాధారణంగా 90 ఏళ్లు దాటాయంటే వృద్ధులు మనవళ్లతో, మనవరాళ్లతో, మునిమనవళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తా్రు. కానీ అందుకు భిన్నంగా ఈ 97ఏళ్ల వృద్ధురాలు సమాజసేవ చేయడానికి ముందుకొచ్చారు. ఏంటి అంత ముసలావిడ సమాజ సేవ ఏ విధంగా చేస్తుంది అనుకుంటున్నారా. అయితే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.

పూర్తి వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌ రాష్ట్రంలోని నీమ్‌ కా థానా సబ్‌ డివిజన్‌, పురానాబాస్‌ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 97 ఏళ్ల విద్యాదేవి అనే వృద్ధ మహిళ సర్పంచ్‌గా పోటీ చేసింది. పోటీచేయడమే కాదు తన ప్రత్యర్ధుల మీద భారీ మెజారిటీతో గెలిచి రికార్డు కూడా సృష్టించింది. ఇంతటి ముసలావిడ ఏం గెలుస్తుంది లే అని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నట్లున్నారు. ఆమెకి పోటీగా ప్రచారాన్ని కూడా ఎక్కువగా చేయనట్టున్నారు.

ఇంకే ముంది ఎలక్షన్ జరిగి ఓట్ల లెక్కంపు కూడా జరిగింది. లెక్కింపు జరిగే సమయంలో ప్రత్యర్థి పార్టీలు మేమే గెలుస్తామనే ధీమాతో ఉన్నప్పటికీ వారి అంచనాలు తారుమారయ్యాయి. 97 ఏళ్ల విద్యాదేవి సర్పంచ్‌గా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ వయస్సులో ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించిన బామ్మకు గ్రామస్తులే కాదు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచిందని, తనను గెలిపించినందుకు ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైతే నేం గెలుపు సాధించాలంటే వయస్సు అడ్డు రాదని, సంకల్పమే ముందుకు నడిపిస్తుందని ఈ వృద్ధ సర్పంచ్ నిరూపించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories