ఎయిర్ లిఫ్ట్ విజయవంతం...కొండల నుండి హెలికాప్టర్ వెలికితీత

ఎయిర్ లిఫ్ట్ విజయవంతం...కొండల నుండి హెలికాప్టర్ వెలికితీత
x
Highlights

హెలికాష్టర్‌ను భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు విజయవంతంగా కొండల నడుమ నుంచి బయటకు తీసుకొచ్చాయి.

కేదారనాథ్ కొండల మధ్య కొన్ని రోజులు క్రితం ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ హెలికాప్టర్ ను భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్ లు విజయవంతంగా కొండల నడుమ నుంచి బయటకు తీసుకొచ్చాయి. శనివారం రెండు ఎయిర్‌ఫోర్స్‌హెలికాప్టర్ల తో ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు వైమానికదళఅధికార ప్రతినిధి తెలిపారు. వివరాల్లోకెళితే యూటీ ఎయిర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఓ హెలికాప్టర్ 11,500 అడుగుల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్‌లోని హెలిప్యాడ్‌ సమీపంలో కొన్ని రోజుల క్రితం కూలిపోయింది.

కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకున కాలినడక మాత్రమే ఉండడంతో ఇప్పటివరకు హెలికాప్టర్ ను వెలికితీసే అవకాశం రాలేదు. హిమపాతం వల్ల కేదార్‌నాథ్‌ ఆలయాన్నిమూసేసే కాలం దగ్గరికి రావడంతో హెలికాప్టర్ ను ఎలాగైనా బయటకు తేవాలని యూటీ ఎయిర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎయిర్‌ఫోర్స్‌ సంస్థ ను కోరింది. రెండు ఎంఐ-17/ వీశ్‌ హెలికాప్టర్ లను రంగంలోకి దింపిన వైమానిక దళంహెలికాప్టర్ ను విజయవంతంగా డెప్రాడూన్‌లోని సహస్త్రధారకు విజయవంతంగా చేర్చారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఎంఐ-17లో ఒకటి ప్రయాణికుల హెలికాప్టర్ ను హుక్‌కు తగిలించుకొని మరో చోటుకు చేర్చింది. మరో ఎంఐ-17 సాంకేతిక సాయం అందించింది. ఎత్తెన కొండల మధ్య ఈ ఆపరేషన్‌ విజయవంతంగా నిర్వహించడం ఎవైమానికదళ పైలట్ల నైపుణ్యానికి నిదర్శనమని అధికార ప్రతినిధి అన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories