ముగిసిన సీఎల్పీ భేటీ.. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కఠిన వైఖరి..

ముగిసిన సీఎల్పీ భేటీ.. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కఠిన వైఖరి..
x
Highlights

కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. వారం నుంచి గంటకో ట్విస్ట్ రోజుకో మలుపు తిరుగుతున్న కన్నడ రాజకీయాలు మారో మలుపు తిరిగాయి....

కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. వారం నుంచి గంటకో ట్విస్ట్ రోజుకో మలుపు తిరుగుతున్న కన్నడ రాజకీయాలు మారో మలుపు తిరిగాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఇప్పటి వరకు బుజ్జగించిన కాంగ్రెస్ నేతలు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాజీనామా చేసిన 11 ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్‌‌కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 164 (1) కింద వేటు వేయాలన్న కాంగ్రెస్‌‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేయనందునే వేటు వేయాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ కీలక నేత సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జులై 21న కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. రామలింగారెడ్డి సహా అసమ్మతి నేతలు తిరిగొస్తారని ఈ సందర్భంగా మాజీ సీఎం చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories