ఆధార్ తోనే ఓటు:కోర్టులో పిటిషన్

ఆధార్ తోనే ఓటు:కోర్టులో పిటిషన్
x
Highlights

ఓటరు గురింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీనేత, న్యాయవాది అశ్విని...

ఓటరు గురింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీనేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అధార్‌తోనే ఎన్నికలు జరగాలి అని కోరుతూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండి, పారదర్శకత లోపించిందని పిటీషన్‌లో పేర్కొన్నారు.

ఆధార్ తోనే ఓటు:కోర్టులో పిటిషన్ఓటర్లను గుర్తించడం, ఆ సమాచారాన్ని భద్రపరచడం, వారికి గుర్తింపు కార్డుల మంజూరు చేయడం అనేవి ప్రస్తుత కాలంలో పెద్ద సవాళ్లుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ఒక రక్షణాత్మకమైన ఎన్నికల వ్యవస్థను తయారుచేసుకోవాలన్నారు. ఈ-ఓటింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా వేలిముద్రలు, ముఖకవళికల గుర్తింపుతో ఓటు వేయవచ్చునన్నారు. తద్వారా నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించవచ్చునన్నారు. ప్రతి ఎన్నికల ముందు ఒకసారి ఈ ఓటర్ల సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తే చాలునని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే స్పందన లేదని అందుకే కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశానన్నారు. మంగళవారం కోర్టులో ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories