మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్‌

మాతృభూమిపై అడుగుపెట్టిన అభినందన్‌
x
Highlights

మాతృభూమిపై అడుగుపెట్టిన భారతీయ వింగ్ కమాండర్ అభినందన్‌కు అపూర్వ స్వాగతం లభించింది.అతని రాకతో దేశవ్యాప్తంగా మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు....

మాతృభూమిపై అడుగుపెట్టిన భారతీయ వింగ్ కమాండర్ అభినందన్‌కు అపూర్వ స్వాగతం లభించింది.అతని రాకతో దేశవ్యాప్తంగా మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. దాయాది పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న అభినందన్‌ వర్థమాన్‌ను భారత్‌కు అప్పగించింది పాక్. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్‌ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీకి అప్పగించారు. వాఘా బార్డర్‌లో ఐఏఎఫ్‌ అధికారులు అభినందన్‌ను రిసీవ్‌ చేసుకున్నారు. కాగా భారత్‌ సహా వివిధ దేశాల నుంచి వచ్చిన హెచ్చరికలతో దాయాది దేశం వణికిపోయింది.

దీంతో అరెస్ట్‌ చేసిన వర్ధమాన్‌ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించింది. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదుల స్థావరంపై భారత్‌ మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో పాక్‌ యుద్ధ విమానాలు మరుసటిరోజు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా పాక్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని భారత్‌ నేలకూల్చగా, పాక్ కు ధీటుగా పోరాటం చేసిన వింగ్ కమాండర్ వర్ధమాన్‌ అభినందన్‌ ను అరెస్ట్‌ చేశామని పాకిస్తాన్‌ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories