ఒడిషా పాఠశాల వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌ ప్రాక్టీస్‌లో అపశృతి

* ఆగల్పూర్‌ హైస్కూల్‌లో విద్యార్థి మెడలో గుచ్చుకున్న జావెలిన్‌ స్టిక్‌

R Tripura Malini
Published on: 18 Dec 2022 9:12 AM IST
A Javelin Stick Pierced The Neck Of A Student In Agalpur High School
X

ఒడిషా పాఠశాల వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌ ప్రాక్టీస్‌లో అపశృతి

Odisha: ఒడిషాలో పాఠశాల వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకున్నది. ప్రాక్టీస్‌లో ఉండగా ఓ విద్యార్థి మెడలోకి జావెలిన్‌ స్టీక్ట్‌ దూసుకెళ్లింది. బోలంగీర్‌ జిల్లా ఆగల్పూర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో యాన్యువల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఓ విద్యార్థి విసిరిన జావెలిన్‌ త్రో స్టిక్‌ గురి తప్పి 9వ తరగతి చదువుతున్న సదానంద అనే విద్యార్థి మెడలోకి దూసుకెళ్లింది. ఉపాధ్యాయులు విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో స్టూడెంట్‌ను భీమబోయి గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళుతున్నంత సేపూ జావెలిన్‌ స్టిక్‌ సదానంద మెడలోనే ఉండడంతో ఆ విద్యార్థి నరకయాతన అనుభవించాడు. అయితే ఈ సమయంలో సదానంద ఏ మాత్రం బెదరకుండా చూపిన ధైర్యానికి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. డాక్టర్లు సర్జరీ చేసి జావెలిన్‌ స్టిక్‌ను తొలగించారు. బాలుడికి ప్రాణాపాయం లేదని తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story