logo
జాతీయం

జార్ఖండ్‌లో మావోల పంజా

జార్ఖండ్‌లో మావోల పంజా
X
Highlights

జార్ఖండ్‌లోని సరైకెలా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానిక బుక్రుహాత్‌ ప్రాంతంలో సంత...

జార్ఖండ్‌లోని సరైకెలా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. స్థానిక బుక్రుహాత్‌ ప్రాంతంలో సంత సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు. పోలీసు గస్తీ బృందాన్ని అడ్డుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుని మావోయిస్టులు పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే జంషెడ్‌పూర్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ అదనపు బలగాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. సరైకెలా జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మావోయిస్టు ఘాతుకాన్ని జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల త్యాగాలు వృథాకావని మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story