186 పోస్టులకు 5 లక్షల దరఖాస్తులు

186 పోస్టులకు 5 లక్షల దరఖాస్తులు
x
ప్రేమ్‌చంద్ మిశ్రా
Highlights

దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఒక్క ఉద్యోగానికి ఎంత లేదనుకున్నా వందల మంది పోటీ చేస్తున్నారు. అది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అని...

దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఒక్క ఉద్యోగానికి ఎంత లేదనుకున్నా వందల మంది పోటీ చేస్తున్నారు. అది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అని చూడడంలేదు. వారి చదువులకు తగిన ఉద్యోగమా, కాదా అని కూడా చూడడం లేదంటే అర్థం చేసుకోండి. దేశంలో నిరుద్యోగిత ఎంత మేరకు పెరిగిందో అని.

ఇప్పుడు ఇదే కోణంలో బీహార్‌లో 186 గ్రూప్-డీ పోస్టులకు దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకుంది. ఈ గ్రూప్ డీ పోస్టులకు ఎంతో ఉన్నత చదువులు చదివిన యువత కూడా దరఖాస్తు చేసుకోవడం అనేది విచారించాల్సిన విషయమే.

ఈ విషయమై స్పందించిన కాంగ్రెస్ నేత ప్రేమ్‌చంద్ మిశ్రా ఫ్యూన్, గార్డెనర్లు, గేట్ కీపర్ల పోస్టుల కోసం ఇప్పటివరకు 4,32వేల మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ ఉద్యోగ నియమకాల కోసం ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక్కో రోజు 1500-1600 మందిని అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిపారు. ఇంత మంది నిరుద్యోగులు ఒంటర్వూలకు హాజరుకావడంతో ఒక్కో వ్యక్తిని కనీసం 10 సెకన్లు కూడా ఇంటర్వ్యూ చేయడంలేదని తెలిపారు. అంతే కాకుండా ఇంత తక్కువ సమయాన్ని కేటాయించడం పట్ల ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరుగుతుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ సమస్య మాత్రం తగ్గదని, మన దేశానికి ఇది పెద్ద ముప్పులాంటిదని ప్రేమ్‌చంద్ మిశ్రా అన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories