'యాత్ర' సినిమాను చూసి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఏమన్నారో తెలుసా..?

యాత్ర సినిమాను చూసి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఏమన్నారో తెలుసా..?
x
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయా జీవితంలో భాగమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా మహి.వి.రాఘవ...

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయా జీవితంలో భాగమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర' సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ నెల 8న విడుదలై మంచి వసూళ్లతో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా.. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని చూసి.. దర్శకనిర్మాతలను అభినందించారు.

తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా స్పందించిన ఆయన.. 'యాత్ర చూసాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకేక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశి కి, వారి చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు..' అంటూ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories