Waltair Veerayya: వాల్తేరు వీరయ్య కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్..

Waltair Veerayya: నెట్ ఫిక్స్ ఆఫర్ మైత్రి మూవీ మేకర్స్ వారు తీసుకుంటారా?

Rama Rao
Updated on: 27 Oct 2022 11:53 AM IST
Waltair Veerayya Was Given A Huge Offer By Netflix
X

వాల్తేరు వీరయ్య కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన నెట్ఫ్లిక్స్

Netflix: "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం చిరంజీవి ఇప్పుడు కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో "వాల్తేరు వీరయ్య" సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. "గాడ్ ఫాదర్" సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వారు ఈ సినిమా రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే దీని తాలూకా సగం పేమెంట్ అయిపోయిందని పూర్తి పేమెంట్ అయిపోగానే చిత్ర రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయని సమాచారం. అయితే ఒకవేళ సినిమా విడుదలైన మూడు వారాలకి ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు పర్మిషన్ ఇస్తే నెట్ఫ్లిక్స్ వారు మరికొంత ఎక్కువ అమౌంట్ ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట. మరి మైత్రి మూవీ మేకర్స్ వారు దీనికి ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story