logo
సినిమా

హీరో విశాల్ చేసుకోబోయే అమ్మాయి ఈవిడే..

హీరో విశాల్ చేసుకోబోయే అమ్మాయి ఈవిడే..
X
Highlights

నటుడు విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా 15 రోజులనుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్న...

నటుడు విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా 15 రోజులనుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి కృష్ణా రెడ్డి విశాల్ పెళ్లిపై ప్రకటన చేశారు. దాంతో విశాల్ ను పెళ్లి చేసుకోబోయే ఆ లక్కీ గర్ల్ ఎవరనే ఉత్సాహం అభిమానుల్లో మొదలయింది. విశాల్ కు కాబోయే భార్య హైదరాబాద్‌కి చెందిన విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల ముద్దుల కుమార్తె.

విజయ్ రెడ్డి బిజినెస్ మ్యాన్ గా స్థిరపడ్డారు. సంక్రాంతి తరువాత వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరగనుందని తెలుస్తోంది.అందుకోసం ఇరుకుటుంబాలు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించట్టు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెల్లూరుజిల్లా మూలాలు ఉన్న విశాల్.. తెలుగమ్మాయినే పెళ్లి చేసుకోబోతుండటంతో విశాల్ తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story