అందుకే ఇక్కడ ఉన్నా:విజయ్ దేవరకొండ

అందుకే ఇక్కడ ఉన్నా:విజయ్ దేవరకొండ
x
Highlights

తమ్ముడు ఆనంద్ అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బు పంపించి సాయం చేశాడు అందుకే నేనిక్కడ ఉన్నా అంటూ తన తమ్ముడు ఆనంద్ గురించి చెప్పారు హీరో విజయ్...

తమ్ముడు ఆనంద్ అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బు పంపించి సాయం చేశాడు అందుకే నేనిక్కడ ఉన్నా అంటూ తన తమ్ముడు ఆనంద్ గురించి చెప్పారు హీరో విజయ్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 12 న విడుదల కానుంది. దీనికోసం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన తమ్మునితో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఈ సందర్భంగా అయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. '' దొరసాని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రామ్మన్నపుడు సినిమా చూస్తె కానీ రానని చెప్పను. సినిమా చూపించారు. ఇటువంటి సినిమా నా మొదటి సినిమా ఎందుకు కాలేదా అని అనిపించింది. ఇది ఓ మ్యాజిక్. శివాత్మిక మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుంది. ఇక మా తమ్ముడు సినిమాల్లో నటిస్తానని చెప్పినప్పుడు నీ సినిమా నువ్వు చేసుకో, నేనేం సాయం చేయనని చెప్పా. కానీ, తనే కథ విని సినిమా చేశాడు. ఇపుడు ఈ సినిమా చూసాకా అర్థం అయింది తనెంత మంచి నిర్ణయం తీసుకున్నాడో. చిన్నప్పుడు పుట్టపర్తిలో హాస్టల్‌లో ఉంటూ చదువుకొన్నా. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు మా తమ్ముడు ఒకటో తరగతిలో చేరాడు. రెండో పీరియడ్‌లోనే మా క్లాస్‌ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆడుకుంటూ ప్రతి ఐదు నిమిషాలకోసారి నేనున్నానా అని చెక్‌ చేసేవాడు. వాడు మూడు రోజులు మా క్లాస్‌లోనే కూర్చున్నాడు. తను సినిమా చేస్తున్నాడని తెలిసి కూడా దాని గురించి ఎప్పుడూ ఆరా తీయలేదు. తనే కష్టపడుతూ క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొన్నాడు.'' అంటూ విజయ్ దేవరకొండ చెప్పారు.

దొరసానిలో రాజశేఖర్‌, జీవితల తనయ శివాత్మిక కథానాయికగా పరిచయమవుతోంది. మహేంద్ర దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, యష్‌ రంగినేని నిర్మాతలు. ప్రశాంత్‌ విహారి స్వరాలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌, జీవిత, నందినిరెడ్డి, రామజోగయ్య శాస్త్రి, తరుణ్‌ భాస్కర్‌, గోరటి వెంకన్న, ప్రశాంత్‌ విహారి, సి.కల్యాణ్‌, వెంకట్‌ సిద్ధారెడ్డి, రాహుల్‌ యాదవ్‌ నక్కా, లగడపాటి శ్రీధర్‌, తేజ, రాజ్‌ కందుకూరి, అనురాగ్‌ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories