logo
సినిమా

'వెంకీ మామా' కి ముహూర్తం ఫిక్స్

వెంకీ మామా కి ముహూర్తం ఫిక్స్
X
Highlights

ఒకవైపు వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న నాగచైతన్య, మరొకవైపు 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన...

ఒకవైపు వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న నాగచైతన్య, మరొకవైపు 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వీరిద్దరూ కలిసి 'వెంకీ మామా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2017 లో జై లవకుశ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కె.ఎస్. రవీంద్ర / బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిజజీవితంలో కూడా నాగచైతన్యకు వెంకీ మేనమామ అవుతాడు అని తెలిసిన విషయమే.

ఇంతకుముందు చై నటించిన 'ప్రేమమ్' సినిమాలో వెంకీ ఒక ముఖ్య అతిథి పాత్రలో కనిపించారు కానీ ఇప్పుడు మళ్లీ మేనల్లుడు తో కలిసి ఫుల్-లెంగ్త్ పాత్రలో మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు వెంకీ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 21వ తారీకు నుండి పట్టాలు ఎక్కనుందని తెలుస్తోంది. ఈ లోపల ఇద్దరు హీరోలు వారి పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా పైన దృష్టి పెట్టనున్నారు. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నటిస్తుండగా నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది.

Next Story