బిగ్‌బాస్‌ లో ఆకలి కేకలు!

బిగ్‌బాస్‌ లో ఆకలి కేకలు!
x
Highlights

నా చపాతీ ఎవరో తినేశారు.. నా భార్యకి రెస్పెక్ట్ ఇవ్వు.. రిమోట్ ఎవరు ఆపరేట్ చేశారు? చిన్న పిల్లల్లా సరదాగా కొద్దిసేపు చేయండని బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్...

నా చపాతీ ఎవరో తినేశారు.. నా భార్యకి రెస్పెక్ట్ ఇవ్వు.. రిమోట్ ఎవరు ఆపరేట్ చేశారు? చిన్న పిల్లల్లా సరదాగా కొద్దిసేపు చేయండని బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్ సమయంలో ఏమీ చేయలేకపోయారు కానీ, ఇప్పుడు మాత్రం చిన్న పిల్లల కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. గురువారం బిగ్‌బాస్‌ ఎపిసోడ్ మూడు గొడవలు.. ఒక లగ్జరీ టాస్క్.. చిన్న కామెడీ స్కిట్ తో పస లేకుండా సాగింది. ఒకరకంగా చెప్పాలంటే విసిగించింది కూడా.

వంటింట్లో బుధవారం రేగిన మంటకి కొనసాగింపుగా అన్నట్టు గురువారం ఎపిసోడ్ నడిచింది. ఆ గొడవ ఎదో అందరూ కల్సి సర్దుబాటు చేసుకున్దామనుకున్నారు. నాగార్జున గారి స్టేటస్ కి ఇంత సిల్లీ గొడవ సాల్వ్ చేసే పని చెబుతామా ఏమిట్? అంటూ మహేష్ అనడంతో కొద్దిగా రిలీఫ్ వచ్చి ఆ గొడవ సర్దుమణిగిందనిపించింది. హమ్మయ్య అనుకునే లోపు.. పునర్నవి నా చపాతీ సగమే వుంది.. సగం ఎవరో తినేశారు అంటూ గొడవ మొదలెట్టింది. చాలా సిల్లీగా ఆలీ తినేశాడని తిట్టింది. చివరికి బాబా భాస్కర్ తిన్నాడని తెలిసి కామ్ అయింది. అది ఆగింది అనుకునే లోపు.. వితిక షేరు.. మహేష్ ల మధ్య వాదులాట మొదలయింది. తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడంటూ మహేష్ పై ఫైర్ అయింది రితిక. దీనిలో కల్పించుకున్న వరుణ్ సందేశ్ నా భార్యకి రెస్పెక్ట్ ఇవ్వవా అంటూ మహేష్ తో ఫైట్ కి దిగాడు. హౌస్ మేట్స్ అందరూ కల్సి వాళ్లిద్దర్నీ కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఈలోపు బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులందరూ కలిసి ఓ ఇద్దరి పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. జాఫర్‌, హేమలను హౌస్‌మేట్స్‌ ఎంచుకోగా .. వారిద్దరి స్విమ్మింగ్‌పూల్‌ వద్ద ఉన్న రెండు రూమ్స్‌లోకి ఇద్దరిని చెరొక రూమ్‌లోకి వెళ్లమని ఆదేశించాడు. ఆ రూమ్స్‌లో రెండు బటన్స్‌(రెడ్‌, గ్రీన్‌) ఉండగా.. బిగ్‌బాస్‌ అడిన వాటికి ఇద్దరు ఒకే బటన్‌(గ్రీన్‌) నొక్కితే లగ్జరీ బడ్జెట్‌లో పాలు, రెడ్‌ బటన్‌ నొక్కితే గుడ్లు లభ్యం కావని, ఇద్దరూ వేర్వేరుగా బటన్స్‌ నొక్కాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ టాస్క్ ని జాఫర్, హేమ విజయవంతంగా పూర్తి చేశారు.

ఇక లగ్జరీ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినందుకు ౩వేల పాయింట్లు లభించాయి. వాటిని సద్వినియోగ పరుచుకోవడంలో హౌస్ మేట్స్ విఫలం అయ్యారు. ఇక్కడ మరో పెద్ద రగడ రేగింది. మహేష్‌, హేమలకు టీవీ ఆపరేట్‌చేయడం రాకపోవడం, ఏ ఏ సరుకులు కావాలో త్వరగా తేల్చుకోలేకపోవడంతో లగ్జరీ బడ్జెట్‌ వృథాగాపోయింది. అయితే దీనికి కారణం శ్రీముఖేనని.. పిలిచినా రాలేదని హేమ అనడంతో శ్రీముఖి ఫైర్‌ అయింది. తాను సరైన సమయానికే వచ్చానని, కానీ టీవీని సరిగా ఆపరేట్‌ చేయలేదంటూ శ్రీముఖి చెప్పింది. ఇక అందరూ ఈ విషయంపై తలోరకంగా మాట్లాడి రచ్చ చేశారు.

ఇలా రోజంతా ఒకరినొకరు కొట్టుకుంటూనే కాలం గడిపారు బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులందరూ. అయితే మధ్యలో ఒక్కసారి మాత్రం చిన్న కామెడీ స్కిట్ చేసి కాస్తంత రిలీఫ్ ఇచ్చారు జాఫర్‌, హేమ, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు.

ఎలా వుందంటే..

ఈ ఎపిసోడ్ చూసిన వారికి బిగ్‌బాస్‌ హౌస్ లో ఆకలితో వాళ్ళంతా ఇలా కొట్టుకుంటున్నట్టు కనిపించింది. ఎక్కువ గొడవంతా తిండి విషయాల మీదే రెండు రోజులుగా జరుగుతుండడం.. ఏ చిన్న గొడవ జరిగినా అది తిరిగి తిండి దగ్గరకు వచ్చి ఆగుతుండడంతో ఆ అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేశారు. ఈ గొడవలు కూడా చాలా సిల్లీగా వున్నాయి. ఈ ఎపిసోడ్ అసలు ఎంటర్టైన్ చేయలేకపోయినాట్టే కనిపిస్తోంది. ఎక్కువగా త్రోల్స్ వస్తున్నాయి. మీమ్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా హాఫ్ చపాతీ ఇష్యూ మీద నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ మూడో సీజన్ ఆరంభంలోనే గొడవల గోలతో నిండిపోతోంది. ఇక ఈ గొడవలకు నాగార్జున ఎలా పుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories