వారసుడు సినిమాని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?

* "వారసుడు" సినిమాలో విజయ్ కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోలను అనుకున్నారట కానీ వారు ఈ కథను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.

R Tripura Malini
Published on: 17 Dec 2022 1:22 PM IST
Varasudu Movie Was Rejected By Two Star Heroes
X

వారసుడు సినిమాని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?

Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా ఇప్పుడు "వారసుడు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన కెరియర్ లోనే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా గా తెరకెక్కనున్న ఈ సినిమాకి "మహర్షి" ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు నందమూరి బాలకృష్ణ "వీర సింహ రెడ్డి" సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం "వారసుడు" సినిమాలో విజయ్ కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోలను అనుకున్నారట కానీ వారు ఈ కథను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే వంశీ పైడిపల్లి మహేష్ బాబు హీరోగా మహర్షి అనే సినిమాకి దర్శకత్వం వహించారు. అప్పటినుంచి మహేష్ బాబుకి మంచి స్నేహితుడిగా ఉన్న వంశీ పైడిపల్లి మళ్లీ మహేష్ బాబుతో ఇంకో సినిమా చేయాలని అనుకున్నారు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం వారసుడు సినిమా కోసం కూడా ముందు మహేష్ బాబుని అనుకున్నారట కానీ మహేష్ బాబు సినిమాకి నో చెప్పారని సమాచారం. ఇక సినిమా గురించి మాట్లాడుతూ దిల్ రాజు కూడా రామ్ చరణ్ కి స్క్రిప్ట్ నీ వినిపించినట్లు చెప్పారు కానీ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నా రామ్ చరణ్ ఈ సినిమాకి నువ్వు చెప్పారట. ఆ తరువాతే ఈ సినిమా విజయ్ చేతుల్లోకి వెళ్లిందని అన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story