ప్రధాని మోడీ జీ ఇది బాధిస్తోంది.. సంచలనంగా మారిన ఉపాసన కామెంట్!

ప్రధాని మోడీ జీ ఇది బాధిస్తోంది.. సంచలనంగా మారిన ఉపాసన కామెంట్!
x
Highlights

ఢిల్లీలో శనివారం ప్రధాని మోడీ #ChangeWithin పేరుతో బాలీవుడ్ కి సంబంధించిన సినీ ప్రముఖులను కలిశారు. ఈ కార్యక్రమానికి దక్షిణాదికి చెందిన ఏ ఒక్క కళాకారుడికి ఆహ్వానం లభించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

మెగా స్టార్ కోడలిగా ఉపాసనకు మంచి గుర్తింపు ఉంది. అంతే కాకుండా ఆమె సోషల్ మీడియాలోనూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. సామాజిక చైతన్య పరమైన పోస్టులను సామాజిక మాధ్యమాలలో పంచుకుంటారు ఉపాసన. అదేవిధంగా ముఖ్యమైన విషయాలపై తన అభిప్రాయాలనూ ముక్కుసూటిగా చెబుతుంటారు. ఇప్పుడు ఈమె ప్రధాని మోడీ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా జనంలో కూడా చర్చనీయాంశంగా మారిపోయింది.

ఢిల్లీలో శనివారం ప్రధాని మోడీ #ChangeWithin పేరుతో బాలీవుడ్ కి సంబంధించిన సినీ ప్రముఖులను కలిశారు. ఈ కార్యక్రమంలో షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా పలువురు సినీ, టెలివిజన్‌ ప్రముఖలు హాజరయ్యారు. ఇదే విషయాన్ని ప్రధాని ట్విట్టర్ లో పంచుకున్నారు కూడాను. సరిగ్గా ఇదే విషయం పై ఉపాశన మోడీ ని ఉద్దేశించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దక్షిణాది చిత్రసీమకు చెందిన ఒక్కరిని కూడా మోడీ ఈ కార్య్కర్మానికి పిలవకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు.

'' ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారూ.. మీరు ప్రధాని అయినందుకు దక్షిణాది ప్రజలు గర్విస్తున్నారు. కానీ మీరు దక్షిణాది కళాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం బాధకు గురిచేస్తోంది. కేవలం ఉత్తరాది కళాకారులతోనే మీరు కార్యక్రమాన్ని నిర్వహించడం బాధిస్తోంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను'' అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఉపాసన.

ఇప్పుడు ఈ ట్వీట్ పై దక్షిణాదిలో ఉపాసనను అభినందిస్తున్నారు. భారత చలన చిత్ర పరిశ్రమలో దక్షిణాదిని ఎప్పుడూ తక్కువగానే చూస్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకూ ఎవరూ కూడా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై పెదవి విప్పలేదు. ఉపాసన నేరుగా ప్రధాని నే ఈ విషయంలో ప్రశ్నించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆమె పోస్ట్ కు మద్దతు కూడా పలుకుతున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు దక్షిణాదిన సంచలనం గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories