లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానున్న ఇద్దరు స్టార్ లు

Two Stars Will be a Part of Lokesh Cinematic Universe
x

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానున్న ఇద్దరు స్టార్ లు 

Highlights

*విజయ్ ను కూడా సినిమాటిక్ యూనివర్స్ లోకి లాగేస్తున్న లోకేష్

Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా "ఖైదీ" అనే సినిమాతో దర్శకుడిగా మారిన లోకేష్ కనగరాజ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇక ఈ మధ్యనే కమల్ హాసన్ హీరోగా నటించిన "విక్రమ్" సినిమాతో ఖైదీ పాత్రలను కూడా పరిచయం చేసి తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేశారు లోకేష్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరుతో ఇప్పుడు మూడవ సినిమాగా "ఖైదీ 2" త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

"ఖైదీ" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే కార్తీ, సూర్య, కమల్ హాసన్, ఫాహాధ్ ఫాసిల్ వంటి స్టార్ లు ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అయ్యారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మరొక ఇద్దరు స్టార్ లు కూడా జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ తో #తలపతి67 సినిమాతో లోకేష్ కనగరాజ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని కూడా లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో కలిపెయ్యబోతున్నరని తెలుస్తోంది.

ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అంటే విజయ్ తో పాటు సంజయ్ దత్ కూడా త్వరలోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతున్నారు అన్నమాట. నిజానికి సంజయ్ దత్ పాత్ర కోసం ఒక టాలీవుడ్ హీరో ను ఎంపిక చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ "కే జి ఎఫ్ 2" తర్వాత సంజయ్ దత్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో లోకేష్ సినిమా కోసం సంజయ్ దత్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories