టీవీ నటుడి ఇంట్లో తీరని విషాదం

టీవీ నటుడి ఇంట్లో తీరని విషాదం
x
Highlights

చిన్న నిర్లక్ష్యం ఒక్కోసారి పెను విషాదానికి దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఏ మాత్రం ఏమరపాటు గా ఉన్నా ఆ ఏమరపాటు ప్రాణాలు తీస్తుంది....

చిన్న నిర్లక్ష్యం ఒక్కోసారి పెను విషాదానికి దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఏ మాత్రం ఏమరపాటు గా ఉన్నా ఆ ఏమరపాటు ప్రాణాలు తీస్తుంది. తీరని గర్భశోకాన్ని తల్లిదండ్రులకు మిగులుస్తుంది. సరిగ్గా ఇటువంటి చిన్న ఆదమరుపే ఆ చిన్నారి ప్రాణాల్ని హరించింది. ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటుంది కదా అని అమ్మా నాన్నా అనుకున్నారు. కానీ, ఆ అటవస్తువుల్లో ఓ చిన్ని వస్తువును పొరబాటున మింగేసిన చిన్నారి అది గొంతులో ఇరుక్కోవడంతో ఉపిరి ఆగిపోయి ఉసురు పోగొట్టుకుంది. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. ఈ చిన్నారి తండ్రి ప్రతీష్‌ వోరా ప్రముఖ టీవీ నటుడు. ప్రస్తుతం ఆయన 'ప్యార్ కే పాపడ్' అనే టీవీ (స్టార్‌ భారత్‌) షోలో నటిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో తన రెండేళ్ల పాపను కోల్పోవడంతో ఆయన కన్నీటి పర్యంతమవుతున్నారు. తీరని దుఃఖంతో పాప అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

చిన్నపిల్లల విషయలో ఎంత జాగ్రతగా ఉండాలో ఈ సంఘటన చెబుతోంది. ముఖ్యంగా బొమ్మలు ఇచ్చేటప్పుడు వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండబోదని నిర్ధారించుకుని ఇవ్వాలి. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న ఇటువంటి సంఘటనల పట్ల ఇకనైనా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు పసిసిల్లల పరిసరాల్లో ఉన్నవాళ్లు కూడా వారిని ఒక కంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories