Nandamuri BalaKrishna: తన సీక్వెల్ సినిమాకి దర్శకత్వం వహిస్తాను అంటున్న హీరో

BalaKrishna: అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదిత్య 999 మాక్స్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తాను

R Tripura Malini
Published on: 19 Nov 2022 11:25 AM IST
This Hero Will Direct His Own Film
X

తన సీక్వెల్ సినిమాకి దర్శకత్వం వహిస్తాను అంటున్న హీరో

Balakrishna: యువ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యనే "ఓరి దేవుడా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు విశ్వక్ సేన్ "ధంకి" అనే సినిమాతో మాత్రం త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ నేపధ్యంలో మాట్లాడుతూ బాలకృష్ణ కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ సేన్ లాగానే తనకి కూడా ఏదైనా ఒక సినిమాకి దర్శకత్వం వర్ధిల్లాలని అన్నారు బాలయ్య. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకోండి

"విశ్వక్ లాగానే నాకు కూడా ఒక సినిమాకి దర్శకత్వం వహించాలని ఉంది. నర్తనశాల సినిమాకి నేను దర్శకత్వం వహించాల్సింది. కానీ అది కుదరలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదిత్య 999 మాక్స్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తాను" అని అన్నారు బాలయ్య. 1991 లో బాలయ్య హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదల అయిన "ఆదిత్య 369" బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా ఈ "ఆదిత్య 999 మాక్స్" తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. బాలయ్య స్వయంగా సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story