సమంత వచ్చినా రాకపోయినా సినిమా హిట్ అవుతుంది అంటున్న నిర్మాత..!

* మా చేతుల్లో ఒక చాలా మంచి సినిమా ఉంది. అందుకే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది.

R Tripura Malini
Published on: 6 Nov 2022 9:06 AM IST
The producer says that the film will be a hit whether Samantha comes or not
X

సమంత వచ్చినా రాకపోయినా సినిమా హిట్ అవుతుంది అంటున్న నిర్మాత

Yashoda: గత కొంతకాలంగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు "యశోద" అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాకి దర్శక ద్వయం హరి మరియు హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న సమంత హాస్పిటల్ బెడ్ మీద నుంచి సినిమాకి డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇక త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతోంది కానీ సమంత ఆరోగ్యం ఇంకా కుదురుపడకపోవడంతో సమంత ఈ వేడుకకి వస్తారో లేదో అని ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత శివ లెంక కృష్ణ ప్రసాద్ సినిమా గురించి మాట్లాడారు. "సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమంత వచ్చినా రాకపోయినా కూడా "యశోద" సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభిస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను.

మా చేతుల్లో ఒక చాలా మంచి సినిమా ఉంది. అందుకే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంతేకాకుండా కాంతారా సినిమా ఎలా అయితే వివిధ భాషల్లో మంచి కలెక్షన్లను నమోదు చేసుకుందో యశోద సినిమా కూడా మిగతా భాషల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అనుకుంటున్నాను," అని అన్నారు శివలెంక కృష్ణ ప్రసాద్. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మధుబాల, రావు రమేష్ మరియు మురళీ శర్మ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story