మొదటి సినిమాకి కూడా ప్రమోషన్లు చేయని హీరోయిన్

*మొదటి సినిమా విషయంలో కూడా ప్రమోషన్ల పై దృష్టి పెట్టని హీరోయిన్

Jyothi
Published on: 18 Sept 2022 12:08 PM IST
The Heroine did not do Promotions Even for the First Movie
X

మొదటి సినిమాకి కూడా ప్రమోషన్లు చేయని హీరోయిన్

Tollywood: తమన్నా, అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు తమ సినిమాలను ప్రమోట్ చేసినా, చేయకపోయినా కూడా అభిమానులు తమ సినిమాలను చూడడానికి ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటారు. కానీ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి సినిమాకి కూడా ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఒక హీరోయిన్ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. ఆమె మరెవరో కాదు కాయడు లోహర్. మరాఠీ మోడల్ గా పేరు తెచ్చుకున్న ఈమె శ్రీవిష్ణు హీరోగా నటించిన "అల్లూరి" సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. 2018 లో మిస్ ఇండియా పేజెంట్లో పాల్గొన్న ఈమె ఇప్పుడు అల్లూరి సినిమాతో ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టనుంది.

ఈ మధ్యనే ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదలైంది. కానీ ఈమె మాత్రం తన సోషల్ మీడియా ఎకౌంట్లో సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా చేయకపోవడం అందరిని షాక్ కి గురిచేస్తోంది. ఒకవైపు "అల్లూరి" సినిమా గురించి పోస్ట్ చేయకపోగా మరొకవైపు ఆమె నటించిన "పాతోన్పతం నూట్టందు" అనే మలయాళం సినిమా గురించి మాత్రం సోషల్ మీడియాలో తెగ కబుర్లు చెబుతోంది. సెప్టెంబర్ 8న సినిమా విడుదలైంది. అయినా సరే ఆమె ఇంకా సినిమాకి సంబంధించిన పోస్టులు ఆపటం లేదు. అలాంటిది తను నటించిన తెలుగు సినిమాని ప్రమోట్ చేయడంలో మాత్రం ఎందుకు ఆసక్తి చూపించడం లేదు అంటూ అభిమానులు సైతం మండిపడుతున్నారు.

Jyothi

Jyothi

Next Story