రెండవ సినిమాకే భారీ రెమ్యూనరేషన్ అడుగుతున్న డైరెక్టర్

*రామ్ చరణ్ తో సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటున్న డైరెక్టర్

Jyothi
Published on: 10 Dec 2022 5:31 PM IST
The Director is Asking for a Huge Remuneration for the Second Film
X

రెండవ సినిమాకే భారీ రెమ్యూనరేషన్ అడుగుతున్న డైరెక్టర్ 

Buchi Babu Sana: సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు సన "ఉప్పెన" సినిమాతో డైరెక్టర్ గా మారారు. పంజా వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు తాజాగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాని ప్రకటించారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బుచ్చిబాబు ఈ సినిమా కోసం భారీ రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారట. ఈ ఒక్క సినిమా కోసం బుచ్చిబాబు ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండవ సినిమాకే బుచ్చి బాబు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవటం నిజంగా షాకింగ్ విషయం అని చెప్పాలి. కేవలం ఒకే ఒక్క సూపర్ హిట్ సినిమా అందుకున్న బుచ్చి బాబు కి ఇది రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ అనే చెప్పాలి.

బ్లాక్ బస్టర్ అయినప్పటికీ రెండవ సినిమాకి 15 కోట్లు తీసుకోవటం కొంచెం ఎక్కువనే చెప్పాలి. అంతేకాకుండా తన రెమ్యూనరేషన్ లోని మూడవ వంతు బుచ్చిబాబు అడ్వాన్స్ గా తీసుకున్నారని సమాచారం. ఇక మరోవైపు "ఉప్పెన" సూపర్ హిట్ అయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వారు బుచ్చిబాబుకి ఒక బెంజ్ కార్ తో పాటు కాస్ట్లీ ఫ్లాట్ ను కూడా గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Jyothi

Jyothi

Next Story