అందుకే మహేష్ బాబు సీతారను సీరియల్స్ ప్రమోషన్స్ లో చూపిస్తున్నారా?

Mahesh Babu: సితార విషయంలో మహేష్ బాబు నిర్ణయం సరైనదేనా?

Jyothi
Updated on: 20 Sept 2022 3:29 PM IST
That why Mahesh Babu is Showing Sitara in the Serials
X

Mahesh Babu: అందుకే మహేష్ బాబు సీతారా ను సీరియల్స్ లో చూపిస్తున్నారా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంతకాలంగా బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తన కూతురు సితార ఘట్టమనేనీతో కలిసి మహేష్ బాబు సీరియల్స్, రియాలిటీ షో లను కూడా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా జీ తెలుగులో మూడు సీరియల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు సీరియల్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి ఆ సీరియల్స్ లోని నటీనటులతో చేసిన ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో ఆసక్తికరంగా మారింది.

బుల్లితెరపై సితారను ప్రతిసారి చూపిస్తూ ఉండడంతో మహేష్ అభిమానులు ఒక రకంగా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా సినిమాతో వెండితెరపైకి తీసుకువస్తే బాగుంటుందని ఒకవైపు అభిమానులు ఎదురుచూస్తూ ఉంటే మరోవైపు మహేష్ బాబు మాత్రం ఆమెను ఇలా సీరియల్స్ ప్రమోషన్స్ లో చూపించటం అభిమానులు ఏ మాత్రం తీసుకోలేకపోతున్నారు. ఐతే మహేష్ ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఇలా బుల్లితెరపై కనిపిస్తూ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఆలోచించే మహేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, సితార తెరంగేట్రం కంటే ముందే ఆమెను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేస్తే బాగుంటుందని ఆలోచనతోనే మహేష్ బాబు ఇలా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story