మహేష్ బాబు తో అందుకే రాజమౌళి సినిమా చేస్తున్నారా?

S S Rajamouli: మహేష్ బాబుతో ఒక ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు, సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉండాలని ఫిక్స్ అయ్యా

R Tripura Malini
Published on: 5 Dec 2022 11:34 AM IST
That Is Why Rajamouli Chose Mahesh Babu
X

మహేష్ బాబు తో అందుకే రాజమౌళి సినిమా చేస్తున్నారా?

SS Rajamouli: స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఇప్పుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నారు. దాదాపు రాజమౌళి సినిమాలన్నిటికీ స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కూడా స్క్రిప్ట్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి కేవలం మహేష్ బాబు ని మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకున్నారు అని అడగగా, విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటెన్స్ ఆన్సర్ ఇచ్చారు.

"మహేష్ బాబు చాలా ఇంటెన్సిటీ ఉన్న హీరో. తను చేసిన యాక్షన్ సీన్స్ లో చూస్తే చాలా ఎమోషనల్ గా ఉంటాడు. అది ఏ రైటర్ కైనా చాలా అవసరం," అని అన్నారు విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా వచ్చే వేసవిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని అరుదైన అడవి లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. రాజమౌళి మహేష్ బాబుతో ఒక ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు, సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారట. వెంటనే తన ఆలోచనను విజయేంద్ర ప్రసాద్ కి కూడా చెప్పారట.

అలా మహేష్ ను ఫిక్స్ చేశారని అన్నారు విజయేంద్ర ప్రసాద్. "ఒక రైటర్ కి హీరో పాత్ర నుండి ఇంటెన్స్ యాక్టింగ్ ను రప్పించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ మహేష్ ఎలాంటి సన్నివేశంలో అయినా చాలా సులభంగా తనను తాను మలుచుకోగలడు," అని మహేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు విజయేంద్ర ప్రసాద్. జోనర్, హీరో ఫిక్స్ అయ్యాక మహేష్ కోసమే ఈ కథను రాయడం ప్రారంభించామని కూడా పేర్కొన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story