"ఆ మూడు రోజులు చాలా మధురమైనవి" అంటున్న తమన్నా

Tamannaah Says Those Three Days are very Sweet | Tollywood
x

 "ఆ మూడు రోజులు చాలా మధురమైనవి" అంటున్న తమన్నా

Highlights

"ఆ మూడు రోజులు చాలా మధురమైనవి" అంటున్న తమన్నా

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికి ఇండస్ట్రీలో హీరోయిన్గా ప్రవేశించి 15 ఏళ్లు దాటింది. సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా మరోవైపు వెబ్ సిరీస్, ఐటమ్ సాంగ్స్ అని లేకుండా చేతికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా స్టార్ గా మారింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే తమన్నా కరియర్ కు బ్రేకులు పడేలాగా అనిపిస్తుంది. దానికి కారణం ఇలా వచ్చిన ప్రతి ఆఫర్ కి ఓకే చెప్పడమే.

మరోవైపు తమన్న కి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ అయ్యి గుళ్ళు, గోపురాలు, శక్తి పీఠాలు అంటూ సందర్శనలు చేస్తోంది. కనీసం పెళ్లి ఊసు కూడా ఎత్తకుండా తమన్న అటు షూటింగ్ ఇటు దేవాలయాలు అంటూ గడిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే జమ్ములోని మాత వైష్ణవి దేవి ఆలయాన్ని సందర్శించిన తమన్నా తన ఆధ్యాత్మిక పయనం తనకు ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పుకొచ్చింది.

మరోవైపు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ యోగ మైదానానికి వెళ్లి ధ్యానం చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈశ యోగ మైదానా మైదానంలో తాను గడిపిన రెండు మూడు రోజులు తన జీవితంలో చాలా మధురమైనవని, ఆరోగ్యపరంగాను తనకు చాలా మంచి జరిగిందని," చెప్పుకొస్తుంది ఈ భామ.

Show Full Article
Print Article
Next Story
More Stories