Sunny Leone: విష్ణు తో సినిమా గురించి రియాక్ట్ అయిన సన్నీ లియోన్

Sunny Leone: విష్ణు తో సినిమా గురించి రియాక్ట్ అయిన సన్నీ లియోన్

Rama Rao
Published on: 19 Oct 2022 7:30 PM IST
Sunny Leone says that acting with Vishnu Manchu will be Comfortable
X

Sunny Leone: విష్ణు తో సినిమా గురించి రియాక్ట్ అయిన సన్నీ లియోన్ 

Sunny Leone: హీరో మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్ లుగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "జిన్నా". అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్న ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాకి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్క్రీన్‌ ప్లే ను అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి "నాటు నాటు" ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

జాతీయ అవార్డు విజేత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫర్ గా చేస్తున్న జిన్నా సినిమాపై క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ నెల 21 న గ్రాండ్ గా విడుదలవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా సినిమా గురించి మాట్లాడుతూ, "తెలుగులో పూర్తి స్థాయి లో నటిస్తున్న నా మొదటి సినిమా ఇది. లాక్ డౌన్ లో నేను ఈ కథ విన్నాను.

ఇలాంటి కథలు నాకు చాలా ఇష్టం. కథ బాగా నచ్చడంతో సినిమా చేస్తున్నాను. ఇందులో నేను రేణుక అనే డెఫ్ అండ్ డమ్ పాత్రలో నటిస్తున్నాను. మేము కొన్ని ఫన్నీ, ఫ్రాంక్ వీడియోస్ కూడా చేశాము. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. విష్ణు చాలా ఎనర్జీటిక్ పర్సన్. తనతో యాక్టింగ్ చాలా కంఫర్ట్ గా అనిపించింది. విష్ణు ఫ్యామిలీ మంచి హస్పిటాలిటీ చూపించారు," అని చెప్పుకొచ్చింది సన్నీ లియోన్.

Rama Rao

Rama Rao

Next Story