Sukumar: "పుష్ప 3" విషయంలో ఆలోచనలో పడ్డ సుకుమార్

Sukumar: "పుష్ప" ఆఖరి సన్నివేశం గురించి ఎటూ తేల్చలేకపోతున్న సుకుమార్

Jyothi
Updated on: 16 Oct 2022 9:30 PM IST
Sukumar Cannot Decide About the Final Scene of Pushpa
X

Sukumar: "పుష్ప 3" విషయంలో ఆలోచనలో పడ్డ సుకుమార్

Sukumar: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్". రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కింది. ఇందులో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించింది. తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక తాజాగా ఈ సినిమా రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర నెక్స్ట్ పార్ట్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. "కే జి ఎఫ్ 2" సమయంలో ప్రశాంత్ నీల్ సినిమాకి సీక్వెల్ లేదని స్పష్టం చేశారు కానీ సినిమా ఆఖరి సన్నివేశంలో మాత్రం "కేజిఎఫ్ 3" కూడా ఉండబోతోంది అని ప్రేక్షకులు ఊహించుకునేలా చేశారు. అయితే పుష్ప విషయంలో కూడా అదే చేస్తే బాగుంటుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. "పుష్ప 3" సినిమా చేయడం చేయకపోవడం పక్కనపడితే "పుష్ప 2" ఆఖరిలో సీక్వెల్ ఉంటుంది అనే ఆలోచన ప్రేక్షకులకు ఇస్తే బాగుంటుంది అని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఆఖరి సన్నివేశం ఎలా రాస్తే బాగుంటుంది అని సుకుమార్ విభిన్న రకాలుగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story