మృణాల్ ఠాకూర్ కి అన్నీ అలాంటి ఆఫర్ లే వస్తున్నాయా?

*"సీతారామం" హీరోయిన్ కి వస్తున్న అలాంటి ఆఫర్ లు

Jyothi
Published on: 20 Nov 2022 5:47 PM IST
Such Offers are Coming to the Heroine of Sitaramam
X

మృణాల్ ఠాకూర్ కి అన్నీ అలాంటి ఆఫర్ లే వస్తున్నాయా?

Mrunal Thakur: "సీతారామం" సినిమాతో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులో చాలా పాపులర్ అయిపోయింది. కేవలం ఒక్క సినిమాతోనే తన అందం మరియు అభినయంతో మెప్పించిన మృణాల్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఒక్కసారిగా పెంచేసుకుంది. సినిమాలో యువరాణి పాత్రలో కనిపించిన ఈమె నిజంగానే యువరాణి ఏమో అని అభిమానులు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఒక్క సినిమా సూపర్ హిట్ అయిపోవడంతో ఈమెపై ఇప్పుడు ఆఫర్ల వర్షం కురుస్తోందని చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగా ఈమెకు చాలా వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్క హిట్ సినిమాకి ఇన్ని ఫిమేల్ సెంటర్ సినిమా ఆఫర్లు వస్తున్నాయా అని అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.

నిజానికి "సీతారామం" సినిమా విడుదలైన తర్వాత నుంచి ఇలాంటి ఈ వార్తలు వినిపించటం కూడా మొదలైంది. అయితే తాజాగా ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారే మృణాల్ తో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీతారామం సినిమాని నిర్మించిన వైజయంతి మూవీ వారు కూడా మృణాల్ పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయి ఆమె తో ఇప్పుడు స్క్రిప్ట్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి సినిమా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story