logo
సినిమా

ఫిబ్ర‌వ‌రిలో ర‌జ‌నీకాంత్ కుమార్తె వివాహం ..!

ఫిబ్ర‌వ‌రిలో ర‌జ‌నీకాంత్ కుమార్తె వివాహం ..!
X
Highlights

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య 2010లో అశ్విన్ రామ్ కుమార్ అనె అతనిని పెళ్ళాడింది. కొన్ని గొడవల వల్ల పెళ్లైన 7 సంవత్సరాల తర్వాత 2017లో వారు విడాకులు తీసుకున్నారు.

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య 2010లో అశ్విన్ రామ్ కుమార్ అనె అతనిని పెళ్ళాడింది. కొన్ని గొడవల వల్ల పెళ్లైన 7 సంవత్సరాల తర్వాత 2017లో వారు విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ళు ఒంటరి జీవితం గడిపిన సౌందర్య ఇప్పుడు రెండవ పెళ్లి కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నటుడు మరియు వ్యాపారవేత్త అయిన విశాగన్ వినంగమూడి తో సౌందర్య పెళ్లి జరగబోతుంది. విశాగన్ వినంగమూడి కి కూడా ఇది రెండవ పెళ్లి. ఇక ఇరు కుటుంబ సభ్యులను ఒప్పుకోవడంతో వీరి నిశ్చితార్థం ఈమధ్యనే జరిగింది

ఇది ప్రేమావివాహం. సౌందర్య, విశాగన్ ల మధ్య పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు ఇరు కుటుంబ సభ్యులు. ఫిబ్రవరి 11న వీరి వివాహం నిరాడంబరంగా జరగబోతుంది. రజినీకాంత్ మరియు ఇతర కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లి గురించి మీడియాలో పెద్ద హడావిడి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది.

Next Story