అభిమాని పెళ్లి కోసం దేశం దాటి వెళ్లిన సోనూసూద్‌

అభిమాని పెళ్లి కోసం దేశం దాటి వెళ్లిన సోనూసూద్‌
x
Highlights

నిరంతరం సినిమాల్లో ఫుల్ బిజీ బిజీగా సోనూసూద్ ఉంటాడు. చిన్న చిన్న పార్టీలకైతే దూరంగానే ఉంటాడు. అలాంటిది ఓ మహిళా అభిమాని కోరిక మేరకు సోనూసూద్ ఏకంగా...

నిరంతరం సినిమాల్లో ఫుల్ బిజీ బిజీగా సోనూసూద్ ఉంటాడు. చిన్న చిన్న పార్టీలకైతే దూరంగానే ఉంటాడు. అలాంటిది ఓ మహిళా అభిమాని కోరిక మేరకు సోనూసూద్ ఏకంగా దేశందాటి వెళ్లాడు. ఇక సోనూసూద్ అభిమాని కోసం అంత దూరం వెళ్లడంతో ఇప్పుడు నెట్టింట్లో తెగ చర్చనీయాంశంగా మారింది. ఓ అభిమాని కోరికను మన్నించి ఆమె వివాహం కోసం శ్రీలంక వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒక్కటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తుతోంది. సోనూసూద్ తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలోనూ ఆ ఫోటోను షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు సోనూసూద్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

వాస్తవానికి అభిమానులు నటుల ఇంటి వద్దకు వెళితేనే బయటకు వచ్చి మందలించడం చాలా కష్టం. ఇక అభిమానుల పెళ్లిళ్లకు హాజరుఅవ్వడం చాలా తక్కవ అనే చెప్పవచ్చు. అలాంటిది ఓ మహిళ అభిమాని పెళ్లికోసం ఏకంగా దేశం దాటి వెళ్లిన సోనూసూద్‌ గురించి తెలుసుకుని అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అభిమాని వివాహనికి వెళ్లి అందరిని అవాక్ అయ్యేలా చేశారు. ఇటీవల సోనూసూద్‌ నటించిన సీత సినిమాలో ఆయన మరోసారి తన విలక్షణ నటనతో అందర్నీ మెప్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories