Karthi-Shah Rukh Khan: కార్తీ కథతోనే షారుఖ్ ఖాన్ సినిమానా?

Karthi-Shah Rukh Khan: ఒకే కథతో షారుఖ్ ఖాన్ మరియు కార్తీ

Rama Rao
Published on: 15 Oct 2022 6:00 PM IST
Shah Rukh Khan and Karthik Sivakumar with the Same Story
X

Karthi-Shah Rukh Khan: కార్తీ కథతోనే షారుఖ్ ఖాన్ సినిమానా?

Karthi-Shah Rukh Khan: తమిళనాడులో మాత్రమే కాక స్టార్ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. తాజాగా కార్తీ హీరోగా నటించిన "ఖైదీ" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి తెలియని వారు ఉండరు. కొన్ని నెలలుగా సినిమాలకి దూరంగా ఉంటున్న షారుఖ్ ఖాన్ త్వరలోనే పఠాన్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

అంతేకాకుండా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో కూడా షారుఖ్ ఖాన్ "జవాన్" అనే ఒక సినిమా లో నటించనున్నారు. ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.అయితే మరోవైపు కార్తీ హీరోగా కూడా "సర్దార్" అనే ఒక సినిమా తెరకెక్కనుంది. దీవాళి సందర్భంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే "జవాన్" మరియు "సర్దార్" సినిమాల కథ ఒకేలా ఉంటుందట. ఇప్పటికే ఒకే రకమైన సినిమాలు చాలానే చూశాము కానీ ఇద్దరు స్టార్లు నటిస్తున్న సినిమా కథలు ఒకటే అవడం ఇప్పటిదాకా చూడలేదు. పైగా షారుక్ ఖాన్ నటిస్తున్న "జవాన్" సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. "సర్దార్" సినిమా ముందే విడుదలవుతుంది కాబట్టి పర్వాలేదు కానీ ఒకవేళ ఆ రెండు కథలు ఒకేలా ఉంటే "జవాన్" సినిమాకి అది నెగిటివ్ గా మారే అవకాశం ఉంది.

Rama Rao

Rama Rao

Next Story