Karthi: బ్రేక్ ఈవెన్ చేరుకున్న కార్తి సినిమా

Karthi: బ్రేక్ ఈవెన్ చేరుకున్న కార్తి సినిమా

Rama Rao
Published on: 28 Oct 2022 8:28 PM IST
Sardar Movie is also Receiving Good Collections in Tollywood | Tollywood News
X

Karthi: బ్రేక్ ఈవెన్ చేరుకున్న కార్తి సినిమా

Karthi: తమిళంలో స్టార్ స్టేటస్ ఉన్న కార్తి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఇప్పటికే కార్తి హీరోగా నటించిన చాలానే తమిళ్ సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2019లో విడుదలైన "ఖైదీ" సినిమా తర్వాత కార్తీ "సుల్తాన్" వంటి కొన్ని సినిమాలలో నటించారు. కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. తాజాగా ఇప్పుడు కార్తీ "సర్దార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

పీ ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రమే కాక తెలుగులో కూడా మంచి హిట్ గా నిలిచింది.టాలీవుడ్ లో కార్తీ మార్కెట్ బాగా తగ్గిపోతుంది అనుకుంటున్న సమయంలో సర్దార్ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకొని కార్తీకి మంచి హిట్టును అందించింది. 10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ సినిమా 5.5 కోట్లతో బ్రేక్ ఈవెన్ ను చేరుకుంది.

ఇక ఈ నేపథ్యంలో కార్తీ కి ఒక్క బ్లాక్ బస్టర్ పడితే టాలీవుడ్ లో కూడా కార్తీ క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు లోకేష్ కనగరాజ్ సృష్టిస్తున్న సినిమాటిక్ యూనివర్స్ లో ఢిల్లీ పాత్రలో కార్తీ కమల్ హాసన్ నటిస్తున్న "విక్రమ్ 2" సినిమాలో కూడా కనిపించనున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rama Rao

Rama Rao

Next Story