logo
సినిమా

అత్తను ఫాలో అవుతున్న సమంత.. సంచలన నిర్ణయం

అత్తను ఫాలో అవుతున్న సమంత.. సంచలన నిర్ణయం
X
Highlights

కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంటారు కొందరు.అందులో సినిమా వాళ్ళు ముందుంటారు. వారిలో...

కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంటారు కొందరు.అందులో సినిమా వాళ్ళు ముందుంటారు. వారిలో సమంత కూడా ఒకరు.. పెళ్లైనా తర్వాత కూడా విజయవంతంగా తన కేరీర్‌ను కొనసాగిస్తున్న సమంత తనను తాను మరింతగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాలిగుండెను అలవర్చుకుంటున్నారు. సాటి ప్రాణులకూ హానీ చేయకుండా బతకడం కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇకపై కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సామ్ చెప్పారు.

ప్రతి ఏటా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలని అది తూ.చ తప్పకుండ పాటించాలని చిన్నప్పటి నుండి తన తల్లి చెప్పారని సామ్ చెప్పుకొచ్చారు. అందుకే ఈ ఏడాది తను ఇకపై మాంసాహారం ముట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో తన అత్త అమలను ఫాలో అవుతోంది సామ్. అమల కూడా ఎవ్వరికి హాని చెయ్యకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో నాన్ వెజ్ తినడం మానేసింది.

Next Story