సాహో.. బాహుబలిని మించిపోయిందట!

సాహో.. బాహుబలిని మించిపోయిందట!
x
Highlights

సాహో ఇప్పుడు యావత్ భారత చిత్ర సీమలో మారుమోతున్న పేరు. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న భారీ సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పుడు ఎక్కడ చూసినా సాహో గురించిన కబుర్లే! బాహుబలి సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీచిత్రం సాహో. షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఆగస్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సాహో సినిమాని పరిచయం చేసే ట్రైలర్ మొన్న రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఒక్క ట్రైలర్ చూసి సినిమా వర్గాలు విస్తుపోయాయి. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించని థ్రిల్స్ ఆ ట్రైలర్ లో కనువిందు చేశాయి.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాహో హీరో ప్రభాస్ విలేకరులు ముచ్చటించారు. ఈ సందర్భంలో పాత్రికేయులు సినిమా బడ్జెట్ బాహుబలిని మించి ఉందట నిజమేనా అని అడిగారు. దానికి 'అవును దాటింది' అని సమాధానం ఇచ్చాడు ప్రభాస్. తొలుత 'సాహో'ను రూ.250కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు అప్పట్లో చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అదనంగా మరో రూ.100కోట్లు దాటినట్లు సమాచారం. ఒక అబుదాబి షెడ్యూల్‌ కోసమే రూ.80కోట్లు ఖర్చు చేశారని సమాచారం. అంటే మొత్తమ్మీద సాహో సినిమాకి 350కోట్లకు పైగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది.

ప్రపంచంలో అత్యున్నతమైన వాటిని ఒక్క చోటుకు చేర్చం అంటున్నారు ప్రభాస్. చాలా సన్నివేశాలను సహజ లోకేషన్లలోనే తెరకెక్కించినట్టు చెప్పరాయన. తాను గాల్లో ఎగిరిన సీన్, గులాబీ వర్ణంలో ఉన్న సరస్సు ఇలా చాలా విశేషాల్ని ఒక్క చోట చూపిస్తున్నట్టు అయన వెల్లడించారు.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, భూషన్‌కుమార్‌లు ఈ సినిమాను నిర్మించారు. తనిష్క్‌ బాగ్చి, గురు రాఘవ, జిబ్రాన్‌(నేపథ్య) సంగీతం అందించారు. జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, మహేశ్‌ మంజ్రేకర్‌, మందిరాబేడీ, మురళీ శర్మ, అరుణ్‌విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories