Mass Maharaja Ravi Teja: సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో షూటింగ్ మొదలు

* సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్న రవితేజ

R Tripura Malini
Updated on: 13 Nov 2022 9:30 PM IST
Ravi Teja started shooting under the direction of cinematographer
X

సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టిన రవితేజ

Mass Maharaja: వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. కానీ ఆ తరువాత రవితేజ నటించిన ఖిలాడి సినిమా మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఆఖరికి ఈ మధ్యనే విడుదలైన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ ను చాలా సైలెంట్ గా పూర్తి చేసేస్తున్నారు. ఇంతకుముందు నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు రవితేజ హీరోగా సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోలాండ్ లో జరుగుతోంది. నవదీప్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏక్ మినీ కథ ఫేమ్ కావ్యా థాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు రవితేజ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కాబోతోంది. మరోవైపు "రావణాసుర" సినిమా కూడా సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నారు రవితేజ. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలో కూడా రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తో కూడా బిజీగా ఉన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story