నిర్మాత ఒకే అంటే రెడి అంటున్న రానా

రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా కొత్తరకం సినిమాలను తీయడంలో ముందుంటాడు హీరో రానా దగ్గుబాటి. తెలుగులో హీరో...
రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా కొత్తరకం సినిమాలను తీయడంలో ముందుంటాడు హీరో రానా దగ్గుబాటి. తెలుగులో హీరో గానే కాక అటు హిందీ తమిళంలో కూడా మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు భళ్లాలదేవుడు. 'బాహుబలి' తరువాత మళ్లీ ఒక పీరియడ్ సినిమాను ఒప్పుకున్నాడు రానా. అదే '1945'. తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సత్య శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగుతుందని సమాచారం.
రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాజర్, సత్య రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో కొచ్చి మరియు శ్రీలంక షూటింగ్ షెడ్యూల్ ల్లను పూర్తి చేసిన ఈ చిత్ర బృందం నుంచి ఈ మధ్య కాలంలో ఒక అప్డేట్ కూడా బయటకు రాలేదు. అయితే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫైనాన్షియల్ సమస్యల కారణంగా నిర్మాతలు హోల్డ్ లో పెట్టారట. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు సినిమాను పట్టాలు ఎక్కిస్తే అప్పుడు రానా షూటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాత ఎస్. ఎన్. రాజరాజన్ ఈ సినిమాను మళ్ళీ ఎప్పుడు మొదలుపెడతారో వేచి చూడాల్సిందే.
లైవ్ టీవి
పౌరసత్వ సవరణ బిల్లు చించేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
9 Dec 2019 5:13 PM GMTభద్రాద్రి కళ్యాణానికి సిద్ధం అవుతున్న తలంబ్రాలు
9 Dec 2019 5:04 PM GMTదిశ కేసులో నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలింపు
9 Dec 2019 4:42 PM GMTరాశీఖన్నాకి ఆ రెండు సినిమాలే దిక్కు
9 Dec 2019 4:41 PM GMTరూటు మార్చిన ధోని..
9 Dec 2019 4:34 PM GMT