logo
సినిమా

'భాగమతి' కోసం భల్లాలదేవుడు

భాగమతి కోసం భల్లాలదేవుడు
X
Highlights

గత ఏడాది మొదట్లో 'భాగమతి' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి బరువు తగ్గడం కోసం ...

గత ఏడాది మొదట్లో 'భాగమతి' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి బరువు తగ్గడం కోసం కొంతకాలం సినిమాలనుంచి బ్రేక్ తీసుకుని సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టనున్న అనుష్క 'సైలెన్స్' అనే చిత్రంలో నటించబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, అంజలి, శాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఆర్ మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో భల్లాలదేవుడు రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 'రుద్రమదేవి' మరియు 'బాహుబలి' సినిమాలలో అనుష్క తో కలిసి నటించిన రానా మళ్లీ 'సైలెన్స్' సినిమాతో అనుష్క తో జత కట్టనున్నాడు. ఇక అనుష్క నటించిన 'సైజ్ జీరో' సినిమా లో రానా ప్రత్యేక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. సైలెన్స్ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరగనుంది. ఈ సినిమాలో అనుష్క స్లిమ్ గా సరికొత్త లుక్తో కనిపించనుంది.

Next Story