Top
logo

అప్పా.. మీరే మా స్ఫూర్తి! చిరంజీవికి రామ్ చరణ్ శుభాకాంక్షలు

అప్పా.. మీరే మా స్ఫూర్తి! చిరంజీవికి రామ్ చరణ్ శుభాకాంక్షలు
X
Highlights

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మెగా వారసుడు రామ్ చరణ్ మీరే మాకు ఆదర్శం అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

ఇప్పటికే తండ్రికి తగ్గ తనయుడిగా.. మెగా స్టార్ వారసత్వాన్ని సగర్వంగా భుజాలపై మోస్తున్న మగథీరుడు రామ్ చరణ్‌ అటు అభిమానులతోనూ, ఇటు ఇందాస్త్రీలోని తోటి నటులతోనూ ఎన్నో కితాబులు దక్కించుకుంటున్నారు. సినీ నిర్మాణంలో అడుగు పెట్టి తండ్రితోనే భారీ సినిమా తీస్తూ, అది కూడా ఒక చరిత్ర మర్చిపోయిన స్వతంత్రయోధుడి కథను తెరకేక్కిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ సినిమాతో తన తండ్రి చిరంజీవి చిరకాల వాంఛను నెరవేరుస్తున్నారు. ఈ సంవత్సరం పుట్టినరోజుకు ఆ సినిమానే ఆయన అభిమానులకు కానుకగా ఇస్తున్నారు రామ్ చరణ్.

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 64వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనతో పాటు తనలాంటి ఎందరికో చిరంజీవి స్ఫూర్తి అని వెల్లడించారు.

''నాతోపాటు కొన్ని మిలియన్ల మందికి మీరొక స్ఫూర్తి, ఒక మెంటర్, ఒక గైడ్. వారంతా మిమ్మల్ని మెగాస్టార్ అని పిలుస్తారు. నేను మిమ్మల్ని అప్పా అంటాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా. మా అందరికి మీరు ఇలానే స్ఫూర్తినిస్తారని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను'' అని చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు.Next Story