మూడు భాషలు.. మూడు భాగాలు.. ముగ్గురు నిర్మాతలు.. సరికొత్త 'రామాయణం'

మూడు భాషలు.. మూడు భాగాలు.. ముగ్గురు నిర్మాతలు.. సరికొత్త రామాయణం
x
Highlights

రామాయణం అన్ని కథలకూ మూల కథ. దాదాపుగా కథలన్నీ రామాయణం థీం లోనే ఉంటాయి. అదేవిధంగా రామ కథను ఇప్పటి వరకూ ఎన్నో భాషల్లో, ఎన్నో సార్లు సినిమాలుగా మలిచారు....

రామాయణం అన్ని కథలకూ మూల కథ. దాదాపుగా కథలన్నీ రామాయణం థీం లోనే ఉంటాయి. అదేవిధంగా రామ కథను ఇప్పటి వరకూ ఎన్నో భాషల్లో, ఎన్నో సార్లు సినిమాలుగా మలిచారు. దాదాపుగా అన్ని సినిమాలూ విజయవంతం అయ్యాయి. టీవీ లోనూ సీరియల్ గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. చాలా కాలంగా రామాయణం సినిమాగా మళ్లీ రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇపుడు అవి అధికారికంగా నిజమని తేలింది. 'రామాయణ' పేరుతో తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలసి రామాయణ యజ్ఞానికి దిగారు. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో, మూడు భాగాలుగా భారీ స్థాయిలో 3డీ వెర్షన్లో సిద్ధం చేయనున్నారు. దంగల్ దర్శకుడు నితేష్ తివారీ, మామ్ దర్శకుడు రవి ఉదయవర్ ఈ సినిమాలకు దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. మొదటి భాగం 2021 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ విషయాలన్నిటినీ తరన్ ఆదర్ష్ ట్విట్టర్ లో ప్రకటించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories