గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కి దూరంగా ఉండనున్న రామ్ చరణ్

గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కి దూరంగా ఉండనున్న రామ్ చరణ్

Rama Rao
Updated on: 22 Sept 2022 8:30 PM IST
Ram Charan will stay away from God Father Promotions
X

గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కి దూరంగా ఉండనున్న రామ్ చరణ్

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించారు. ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ సినిమా గురించి బోలెడు కబుర్లు చెప్పారు మెగా హీరోలు. కానీ సినిమా మాత్రం విడుదలైన మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. భారీ అంచనాల మధ్య ఆ విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమా విషయంలో చిరంజీవి మరియు రామ్ చరణ్ తీవ్రంగా నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆచార్య సినిమా అలా అవటం వల్ల చిరంజీవి తన తదుపరి సినిమా "గాడ్ ఫాదర్" ప్రమోషన్స్ పై అంతగా దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్ లో పాలు పంచుకోవట్లేదు. దానికి కారణం ఆచార్య సినిమా గురించి తర్వాత నుంచి రామ్ చరణ్ మీడియాకి దూరంగా ఉండటం. ఆచార్య సినిమా సమయంలో బోలెడు కామెంట్లు చేసిన రామ్ చరణ్ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో షాక్ అయ్యారు.

అప్పటినుంచి మీడియా ముందుకి రావడం కూడా మానేశారు. ఒకవేళ ఆచార్య సినిమా గురించి అడిగితే ఏమని చెప్పాలో తెలియక రామ్ చరణ్ మీడియాని అవాయిడ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే "గాడ్ ఫాదర్" ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ హోస్ట్ గా చిరంజీవి మరియు డైరెక్టర్ మోహన్ రాజాలు గెస్ట్లుగా ఒక ఇంటర్వ్యూ ను ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Rama Rao

Rama Rao

Next Story