బాబాయ్ గ్లిమ్స్ పై అబ్బాయ్ వైరల్ కామెంట్స్

* పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే.

Dhatripriya
Published on: 14 May 2023 10:26 AM IST
Ram Charan Reaction To Pawan Kalyans Glimpse
X

బాబాయ్ గ్లిమ్స్ పై అబ్బాయ్ వైరల్ కామెంట్స్ 

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన 11 ఏళ్ల తర్వాత పవన్, హరీష్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 8 రోజులు విరామం లేకుండా ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ ని పవన్ పూర్తి చేసుకున్నారు. అతి త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా రాక్ స్టార్ డీఎస్సీతో నిర్వహించిన మ్యూజిక్ సిట్టింగ్స్ లో హరీష్..ట్యూన్స్ ను కూడా ఫైనలైజ్ చేసుకున్నాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ లో యాక్షన్ పార్ట్ చిత్రీకరించనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే, గబ్బర్ సింగ్ రిలీజై పుష్కర కాలం కావడంతో ఆ సినిమాకి ట్రిబ్యూట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ మార్క్ స్టైల్, స్వాగ్ తో ఉన్న ఈ గ్లిమ్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేసింది. ఈ గ్లిమ్స్ కు సోషల్ మీడియాలో జస్ట్ 24 అవర్స్ లో 500K లైక్స్ వచ్చాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ ను మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ''loved this massive glimpse of @pawankalyan garu cannot wait to witness this massive entertainer in theaters'' అంటూ ట్వీట్ చేశాడు. బాబాయ్ సినిమా గురించి అబ్బాయ్ ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్, ట్విట్టర్ లో చరణ్ ట్వీట్ కి లైక్స్ మాత్రమే కాకుండా రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.




Dhatripriya

Dhatripriya

Next Story