logo
సినిమా

Rajamouli: "ఆర్ఆర్ఆర్" కి ఆస్కార్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టనున్న రాజమౌళి

Rajamouli Will Spend 50 Crores For Oscar for RRR
X

Rajamouli: "ఆర్ఆర్ఆర్" కి ఆస్కార్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టనున్న రాజమౌళి

Highlights

Rajamouli: "ఆర్ఆర్ఆర్" కి ఆస్కార్ లో స్థానం కోసం 50 కోట్లు వెచ్చిస్తున్న రాజమౌళి

Rajamouli: "బాహుబలి" సినిమా తోని ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తాజాగా ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. భారత దేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఈ సినిమా మాత్రం ఆస్కార్స్ కి నామినేట్ అవ్వలేకపోయింది. అయితే తాజాగా ఇప్పుడు ఆస్కార్లకి కొన్ని సినిమాల్లోనూ వోటింగ్ సిస్టం ద్వారా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ఒక కొత్త స్ట్రాటజీతో ప్లాన్లు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తూ అన్నీ పెద్ద ఈవెంట్లలోనూ దర్శనమిస్తున్నారు.

చాలా చోట్ల "ఆర్ఆర్ఆర్" స్పెషల్ స్క్రీనింగ్ లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఓటేయడానికి హక్కు ఉన్న ప్రొఫెషనల్ దృష్టిలో "ఆర్ఆర్ఆర్" సినిమా పడేలాగా రాజమౌళి అని ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఓటు వేసే వాళ్ళు 10,000 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా "ఆర్ఆర్ఆర్" సినిమా ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 50 కోట్ల దాకా రాజమౌళి వెచ్చించనున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది రాబోతున్న ఆస్కార్లకి "ఆర్ఆర్ఆర్" కచ్చితంగా నామినేట్ అవుతుందని రాజమౌళి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఇండియాలోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఒకటైన "ఆర్ఆర్ఆర్" ఆస్కార్లకు నామినేట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Web TitleRajamouli Will Spend 50 Crores For Oscar for "RRR"
Next Story